బీసీ ఆజాది ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన బండ నిఖిల్ కుమార్ యాదవ్ ను నియమిస్తూ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నిఖిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జక్కని సంజయ్, సహకరించిన రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కుడికల భాస్కర్, ప్రధాన కార్యదర్శి కరీంరాజు ముదిరాజులకు కృతజ్ఞతలు తెలిపారు.