పెద్దపల్లి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

3576చూసినవారు
మంథని మండలం గాడుదుల గండి గుట్ట వద్ద గురువారం రాత్రి అతివేగంగా వచ్చిన లారీ, ఆటోను ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.