మంథని: భూ నిర్వాసితులకు సరైన పరిహారం అందించాలి: కలెక్టర్

65చూసినవారు
మంథని: భూ నిర్వాసితులకు సరైన పరిహారం అందించాలి: కలెక్టర్
జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అర్హతల ఆధారంగా సరైన పరిహారం అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం మంథని మండలంలో పుట్టపాకలో భూ నిర్వాసితుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ వరంగల్- మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సరైన పరిహారం అర్హతల ఆధారంగా అందాలన్నారు. నిర్వాసితులకు నిబంధనల ప్రకారం పరిహారం అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్