పెద్దపల్లి: జూన్ 30 వరకు రేషన్ గడువు పొడిగింపు

63చూసినవారు
పెద్దపల్లి: జూన్ 30 వరకు రేషన్ గడువు పొడిగింపు
రేషన్ కార్డుదారులు తమ రేషన్ తీసుకునేందుకు గడువు జూన్ 30 వరకు పొడిగించడం జరిగిందని అదనపు కలెక్టర్ వేణు సోమవారం ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రజా పంపిణీ బియ్యం జూన్ మాసంలో 3 నెలలు ఒకేసారి పంపిణీ చేస్తున్నందున గడువు జూన్ 30 వరకు పొడిగించడం జరిగిందని లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్