పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్సీ బాలికల ఎస్ఎంఎస్ హాస్టల్, మంథని పట్టణంలో సంగీత నృత్య కళాశాల పక్కా భవనం నిర్మించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ శనివారం వినతి పత్రం అందజేశారు. జిల్లా ఏర్పాటు పదేళ్లు గడుస్తున్నప్పటికీ ఎస్సీ బాలికల ఎస్ఎంఎస్ హాస్టల్ లేకపోవడం వల్ల విద్యార్థినిలు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని మంత్రికి వివరించారు.