పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమని అన్నారు. శుక్రవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ సంఘ సేవకురాలుగా, భూమి, సాయుధ రైతాంగ పోరాటంలో వీర వనితగా చరిత్రలో నిలిచి, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు.