జూన్ చివరి నాటికి మహిళలకు నైపుణ్య శిక్షణ అందించేందుకు వీ-హబ్ భవనం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని వీ-హబ్, రాఘవపూర్ గ్రామంలోని మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న వీ-హబ్ భవన పనులు జూన్ చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.