
మంథనిలో ముదిరాజుల బోనాల జాతర ఘనంగా
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని బోయిన్ పేటలో ప్రతి సంక్రాంతి రోజు ముదిరాజుల కుల దేవత శ్రీ లక్ష్మీ దేవర బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ముదిరాజులు అమ్మవారికి పట్నాలు, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సంతానం వంటి సమస్యలతో బాధపడుతున్న భక్తులకు పోతరాజు కొరడా దెబ్బలతో శుభం జరిగేలా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు, ఇతర భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






































