
చివరి ఆయకట్టు వరకు సాగు నీరందాలి: కలెక్టర్
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో సోమవారం యూరియా సరఫరా, యాసంగి సాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 8 వరకు 7 తడులలో ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదలవుతుందని, జగిత్యాల జిల్లాకు 7 రోజులు, పెద్దపల్లి జిల్లాకు 8 రోజులు నీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు అందుబాటులో ఉందని, సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.







































