
డిసెంబర్ 1 నుంచి ఆన్లైన్లో ఆధార్ కార్డుల అప్డేట్
డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆధార్ కార్డులను ఆన్లైన్లో సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి సమాచారాన్ని మార్చుకోవడానికి ఈ అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియ ద్వారా పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ వంటి ప్రభుత్వ రికార్డులతో ఆధార్ డేటాను సరిచూసుకోవచ్చు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఈ సౌలభ్యం కోసం కొత్త ఆధార్ యాప్ను కూడా ప్రారంభించింది.




