
నేడు పెద్దపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన
నేడు మంథని నియోజకవర్గంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రామగిరి మండలం బేగంపేట గ్రామంలో నూతన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, డిఎంఏఫ్టీ నిధులతో 17 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం మంథని జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో రూ. 44 లక్షలతో నిర్మించిన సింథటిక్ షటిల్ కోర్ట్‌ను ప్రారంభిస్తారు. వివిధ గ్రామాల్లో ఇళ్ల ప్రారంభం, సబ్‌స్టేషన్ శంకుస్థాపన, క్రీడా బహుమతుల ప్రదానం, బాధితుల పరామర్శ వంటి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.





































