పెద్దపల్లి: బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి

1006చూసినవారు
పెద్దపల్లి: బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి
బుధవారం సుల్తానాబాద్ కేంద్రంలోని శాస్త్రి నగర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ కోట నిరంజన్ రెడ్డి (38) మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో మడక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్