పెద్దపల్లి జిల్లాలో భార్యాభర్తల మధ్య గొడవ.. బలైన చిన్నారి

6చూసినవారు
పెద్దపల్లి జిల్లాలో భార్యాభర్తల మధ్య గొడవ.. బలైన చిన్నారి
పెద్దపల్లి జిల్లాలో 10 రోజుల క్రితం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దేవునిపల్లి గ్రామానికి చెందిన షేర్ల హరీశ్‌, భవానీ దంపతుల 10 నెలల కూతురు విష్ణుప్రియ, తండ్రి నెట్టడంతో కిందపడి మృతి చెందింది. అయితే, బాలిక మంచంపై నుంచి పడి చనిపోయిందని అందరినీ నమ్మించాలని భార్యను బెదిరించాడు. ఇదిలా ఉండగా, హరీశ్‌పై ఇటీవల ఓ బాలికపై లైంగిక దాడి చేసినట్లు పోక్సో కేసు నమోదు కావడంతో, తన కూతురు మృతికి అతడే కారణమని భార్య భవానీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ సుబ్బారెడ్డి ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్