పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద ఆదివారం బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను ఎమ్మెల్యే విజయరమణరావు పరిశీలించారు. ఆడపడుచులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని, సద్దుల బతుకమ్మ పండగలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.