ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఎస్ఐ దీకొండ రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమర వీరులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అమర వీరుల త్యాగాలను స్మరించుకొని నినాదాలు చేశారు.