ఆలయాల పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరు..

4చూసినవారు
ఆలయాల పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరు..
సుల్తానాబాద్ మండలం రామునిపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ రూ. 50 లక్షలు, పెద్దపల్లి మండలం పెద్దకల్వల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి రూ. 40 లక్షల సీజీఎఫ్ నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మంగళవారం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యే విజయరమణ రావును కలిసి నిధుల మంజూరుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్