క్రీడలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం: ఎమ్మెల్యే

1387చూసినవారు
క్రీడలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం: ఎమ్మెల్యే
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు శనివారం సాయంత్రం పెద్దపల్లి మార్కెట్ యార్డ్ ఆవరణలో రూ. 2.30 కోట్లతో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఈ ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో అసంపూర్తిగా నిర్మించబడిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్ట్రక్చర్ ను బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం గా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్