కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు..

675చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు..
పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణరావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరినట్లు నాయకులు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్