ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు మంగళవారం ఎలిగేడు మండలం శివపల్లిలోని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులకు ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికిన అనంతరం పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులతో ఎమ్మెల్యే చర్చించారు.