హైదరాబాద్ లో మంగళవారం జరిగిన మున్నూరు కాపు సంఘం సమావేశంలో, ధర్మారం మండలం బుచ్చయ్యపల్లి గ్రామానికి చెందిన ఇమ్మిడిశెట్టి మోహన్ పటేల్ ను తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించారు. ఈ నియామకాన్ని రాష్ట్ర అధ్యక్షులు వనమాల ప్రవీణ్ కుమార్, రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్ పటేల్ ప్రకటించారు. ఈ సందర్భంగా మోహన్ పటేల్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సమావేశానికి మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ అధ్యక్షత వహించారు.