సుల్తానాబాద్ మండలం కనుకుల, రేగడి మద్దికుంట గ్రామాలకు వెళ్లే చౌరస్తా వద్ద మోటార్ సైకిల్ అదుపుతప్పి యువకుడు రఘురాం (18) మృతి చెందాడు. అతివేగంగా వెళ్తున్న క్రమంలో కనుకుల క్రాసింగ్ వద్ద ప్రమాదం జరగడంతో ముక్కుకు, తలకు బలమైన గాయాలై మరణించినట్లు బంధువులు తెలిపారు. సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచారు.