పెద్దపల్లి: గోదావరిలో యువకుడు గల్లంతు

23చూసినవారు
పెద్దపల్లి: గోదావరిలో యువకుడు గల్లంతు
పెద్దపల్లి జిల్లా మంథనిలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లి రావికంటి సాయి(30) అనే యువకుడు సోమవారం గల్లంతయ్యాడు. నది ఒడ్డున అతని వస్తువులు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, యువకుడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టాలని ఆదేశించారు. మంథని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మంత్రి సాయి కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్