పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కందుల సదాశివ నియమితులయ్యారు. మంగళవారం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నియామక పత్రం అందజేశారు. సదాశివ మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా బీసీల హక్కుల కోసం, విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో వారికి దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం పోరాడతానని తెలిపారు.