పెద్దపల్లి జిల్లా మంథనిలో గోదావరిలో కొట్టుకుపోయిన రవికంటి సాయి కోసం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. మూడు పడవలు, గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బందితో గాలింపు చేపట్టినప్పటికీ సాయి ఆచూకీ లభించలేదు. పూర్తిగా చీకటి పడటంతో గాలింపు చర్యలను రేపటికి వాయిదా వేశారు. సాయి ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.