త్రివిధ దళాలకు మద్దతుగా మల్లన్న సన్నిధిలో పూజలు

68చూసినవారు
త్రివిధ దళాలకు మద్దతుగా మల్లన్న సన్నిధిలో పూజలు
పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓదెల శ్రీమల్లికార్జునస్వామి దేవస్థానంలో ఆపరేషన్ సింధూర్ లో ధైర్య సాహసాలతో పోరాడుతున్న భారత త్రివిధ దళాలకు మద్దతుగా శుక్రవారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి సదయ్య ఆధ్వర్యంలో అర్చక సిబ్బంది భక్తుల సమక్షంలో పూజలు చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్