32వ సారి యువకుడి రక్తదానం..

8చూసినవారు
32వ సారి యువకుడి రక్తదానం..
కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అవసరమైన అరుదైన ఓ నెగటివ్ రక్తాన్ని వైకే ఫౌండేషన్ రాష్ట్ర నాయకులు మడ్డి సాయికిషోర్ గౌడ్ మంగళవారం దానం చేశారు. రక్తం అవసరమై వైకే ఫౌండేషన్ కు సమాచారం అందగానే, సాయికిషోర్ స్పందించి మైత్రి బ్లడ్ బ్యాంక్ లో 32వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వైకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు కండెం సురేష్, గౌరవ అధ్యక్షులు విజేందర్ రెడ్డితో పాటు పలువురు సాయికిషోర్ ను అభినందించారు. బాధితుల కుటుంబ సభ్యులు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్