Mar 01, 2026, 17:03 IST/
2029లో జగన్ సీఎం కావడం తథ్యం: కొడాలి నాని
Mar 01, 2026, 17:03 IST
AP: కూటమి ప్రభుత్వం బెదిరింపులకు వైసీపీ భయపడదని ఆ పార్టీ నేత కొడాలి నాని అన్నారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'అంబటి ఎప్పుడూ ఎవరినీ దూషించలేదు. టీడీపీ నేతలు కావాలనే ఆయన్ను రెచ్చగొట్టారు. రాంబాబు క్షమాపణలు చెప్పినా ఆయన ఇంటిపై దాడి చేశారు. లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగానికి వైసీపీ భయపడదు. 2029లో జగన్ సీఎం కావడం తథ్యం. రెడ్ బుక్ లో జగన్ పేరు ఉంటే లోకేశ్ కే ఇబ్బంది' అని హెచ్చరించారు.