
ట్రాన్స్కో అసిస్టెంట్ సెక్రటరీగా విశ్వనాథ్
తెలంగాణలోని విద్యుత్ కార్మికుల సమస్యలపై పోరాడుతున్న తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 1104, ట్రాన్స్కో కంపెనీ నూతన అసిస్టెంట్ సెక్రటరీగా విశ్వనాథ్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, సాయిబాబా ప్రకటించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వారికి, సహకరించిన ట్రాన్స్కో యూనియన్ నాయకులకు విశ్వనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.































