మెగా లోక్ అదాలత్ లో 13,048 కేసుల పరిష్కారం: రామగుండం సీపీ

65చూసినవారు
మెగా లోక్ అదాలత్ లో 13,048 కేసుల పరిష్కారం: రామగుండం సీపీ
రామగుండం కమిషనరేట్ పరిధిలో జాతీయ మెగా లోక్ అదాలత్ లో మొత్తం 13,048 కేసులు పరిష్కరించబడ్డాయని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఆదివారం జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై అండర్ ఇన్వెస్టిగేషన్, కోర్టు విచారణలో ఉన్న ఐపీసీ కేసులు 536 పరిష్కరించబడ్డాయన్నారు. 80 సైబర్ క్రైమ్ కేసులలో బాధితులకు రూ. 17, 66, 294 తిరిగి అందజేశామన్నారు.

సంబంధిత పోస్ట్