భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ చట్టం భూ భారతిపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 17 నుంచి 28 వరకు మండలస్థాయిలో భూ భారతి చట్టంపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పిస్తామని, రెవెన్యూ అధికారులు హాజరై చట్టంలోని అంశాలను వివరిస్తారని తెలిపారు.