స్వరాష్ట్ర సాధనలో అలుపెరగని కృషి చేసిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి తన ఇంటిని, ఆస్తులను దానం చేశారని, స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఐదు దశాబ్దాలుగా అలుపెరగని కృషి చేశారని కొనియాడారు.