సింగరేణి సంస్థ పర్సనల్, అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్ డైరెక్టర్ గౌతమ్ పొట్రు గురువారం అడ్రియాల లాంగ్ వాల్ గనిని సందర్శించారు. ప్రాజెక్ట్ కార్యాలయంలో జీఎం నాగేశ్వరరావుతోపాటు ఇతర గని అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గని వివరాలను తెలుసుకున్నారు. గని ఆవరణలో మొక్కను నాటారు. భూగర్భ గనిలోకి వెళ్లి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న యంత్రాల పని తీరు, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు.