కోల్ కారిడార్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి అంకతి సంతోష్ (రామగుండం-3 డివిజన్, ఓసీపీ-1 సిహెచ్‌పి) దుర్మరణం పాలయ్యాడు. రాత్రి ఇంటికి వెళ్తూ సోలార్ ప్లాంట్ సమీపంలోని మలుపులో రోడ్డు గుంతలో స్కూటీ జారి పడటంతో తలకు గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. లైట్లు లేకపోవడం ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. సంతోష్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కమాన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.