పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర 5వ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈనెల 14, 15 తేదీల్లో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ పట్టణంలో జరగనున్న ఈ మహాసభల్లో, మున్సిపల్ కార్మికుల పర్మినెంట్, కనీస వేతనం రూ. 26 వేలు సాధనకై పోరాటాలకు కార్యాచరణ రూపొందించుకుంటామని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జ్యోతి తెలిపారు. 14న జరిగే బహిరంగ సభకు వేలాది మంది మున్సిపల్ ఉద్యోగ, కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు.