గంజాయి నియంత్రణపై పటిష్ట నిఘా ఉంచాలని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంగళవారం కమిషనరేట్ లో పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సీపీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులు, నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, ప్రస్తుత కేసుల స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు. డిసిపిలు కరుణాకర్, భాస్కర్, అడిషనల్ డిసిపి అడ్మిన్ రాజు పాల్గొన్నారు.