నవంబర్ నాటికి టీబీ పరీక్ష నిర్వహణ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం పాలకుర్తి మండలం బసంత్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్ సీలో వార్డులు, ల్యాబ్ లను కలెక్టర్ పరిశీలించారు. టీబీ వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వల్న రేబుల్ జనాభాను గుర్తించి నవంబర్ లోపు వారి స్క్రినింగ్, వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.