పెద్దపల్లి: స్వర్ణకారులకు ప్రభుత్వం చేయూతనందించాలి

64చూసినవారు
పెద్దపల్లి: స్వర్ణకారులకు ప్రభుత్వం చేయూతనందించాలి
ఉపాధి కోల్పోయిన స్వర్ణకారులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇవ్వాలని జిల్లా స్వర్ణకార సంఘం నాయకులు కోరారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో శనివారం స్వర్ణకారుల సంఘం సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో చేతి వృత్తులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని భావించి ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారని, స్వర్ణకారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు రంగు శ్రీనివాస్ కోరారు.

సంబంధిత పోస్ట్