మాల మహానాడు ఆధ్వర్యంలో మేయర్‌కి వినతి

1చూసినవారు
మాల మహానాడు ఆధ్వర్యంలో మేయర్‌కి వినతి
కరీంనగర్‌లో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు తిలక్ రాజు, మేయర్ కొలగాని శ్రీనివాస్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. మేదరి భాగ్యరెడ్డి వర్మ విగ్రహం వద్ద సుందరీకరణ పనులు చేపట్టి, మే 22న జరగనున్న జయంతి వేడుకల సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని వారు కోరారు. దీనిపై స్పందించిన మేయర్ వెంటనే పనులు ప్రారంభించి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బైరం కుమార్, కవిత, రేణుక తదితరులు పాల్గొన్నారు.