కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్, రైతుల ఆందోళన

7చూసినవారు
సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు, గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 24 గంటల ఉచిత విద్యుత్, ఎరువుల (యూరియా) కొరత నివారణ, రైతు బీమా, బకాయిల విడుదల తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజిరెడ్డి, సర్పంచులు, సెస్‌ డైరెక్టర్ పాల్గొన్నారు. 'కావాలి కావాలి యూరియా కావాలి. యాప్‌లు వద్దు, షాప్‌లు ముద్దు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన' అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్