టాస్క్ సెంటర్‌లో ఉచిత శిక్షణకు ఈనెల 25 వరకు గడువు

3చూసినవారు
టాస్క్ సెంటర్‌లో ఉచిత శిక్షణకు ఈనెల 25 వరకు గడువు
రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ కార్యాలయంలోని టాస్క్ (TASK) రీజనల్ సెంటర్‌లో ఉచిత సాంకేతిక, బ్యాంకింగ్ కోర్సుల శిక్షణ కోసం కొత్త బ్యాచ్‌లు ప్రారంభమవుతున్నాయి. డిగ్రీ, బి. టెక్, డిప్లొమా లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ శిక్షణకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు తమ వివరాలను సిరిసిల్ల టాస్క్ రీజనల్ సెంటర్‌లో నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా సర్టిఫికెట్లు అందించడమే కాకుండా 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇతర వివరాల కోసం 9573420718, 7075522671 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్