రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ చెందిన ఎగుమామిడి అఖిల్ రెడ్డి గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటాడు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో రాష్ట్రంలో 34వ ర్యాంక్ సాధించాడు. అఖిల్ రెడ్డి చిన్ననాటి నుంచి చదువులో ముందు ఉండేవాడని గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.