సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం విధులకు హాజరయ్యేందుకు వచ్చిన డీఆర్డీఏ ఏపిడి అధికారి కూర నర్సింహులు పైఅంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కగా సాంకేతిక లోపం వల్ల లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. దాదాపు గంటన్నర పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఆయన, శ్వాస ఆడడం లేదని తోటి ఉద్యోగులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అనంతరం సాంకేతిక నిపుణులు వచ్చి ఆయనను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.