కొనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్లో అక్టోబర్ 31న అదృశ్యమైన నిజామాబాద్కు చెందిన బద్దెపురి నారాయణ(80) అనే వృద్ధుడి మృతదేహం లభించింది. వృద్ధుడి కుమారుడు నవంబర్ 3న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, రిజర్వాయర్లో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.