రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడి బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు పదుల సంఖ్యలో రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు, ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంభీరావుపేట నుంచి నర్మల, లింగన్నపేట వెళ్లే దారిలో చెట్లు పడటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయి. ఎస్సై శ్రీకాంత్ జెసిబి సహాయంతో రోడ్డుపై నుంచి చెట్లను తొలగించారు.