అథ్లెటిక్స్ క్రీడలకు మూలాధారమని ప్రతి క్రీడాకారునిలో వేగం, బలం, ఓర్పు, చురుకుదనాన్ని పెంపొందిస్తాయని విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ పెంపొందించడంలో అథ్లెటిక్స్ కీలక పాత్ర పోషిస్తుందని
పరుగులు, జంప్స్, త్రోస్ వంటి విభాగాల ద్వారా విద్యార్థుల సహజ ప్రతిభ వెలుగులోకి వస్తుందని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి గారు అన్నారు. పాఠశాలకు చెందినటువంటి
విద్యార్థులు స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అభినందన సభకు ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అథ్లెటిక్స్ పోటీలు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వ స్ఫూర్తిని పెంచుతాయని గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించే క్రీడా స్ఫూర్తిని అలవర్చే గొప్ప వేదిక అథ్లెటిక్స్
పాఠశాల స్థాయి నుంచే అథ్లెటిక్స్‌కు ప్రోత్సాహం అందించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చని తెలిపారు.
ఇటీవల కాలంలో కరీంనగర్ లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో నిర్వహించినటువంటి 1వ కిడ్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో పాఠశాలకు చెందినటువంటి
ఓ.ఆశ్రిత, 4వ తరగతి, అండర్ -10 విభాగం లో 60 మీటర్ల పరుగులో బంగారు పతకం.
ఆరుష్, 7వ తరగతి, అండర్ 12, స్టాండింగ్ లాంగ్ జంప్ విభాగంలో బంగారు పతకం & 1 కేజీ షాట్ పూట్ మరియు బ్యాక్ త్రో పోటీలలో రజత పతకం
పైజాన్, 5వ తరగతి, అండర్-12, 60 మీటర్ల పరుగుల విభాగంలో బంగారు పతకం, 400 మీటర్ల పరుగులో బంగారు పతకం
సాకీబ్, 8వ తరగతి, అండర్ 14 విభాగంలో, కిడ్ జావలిన్ త్రోలో - రజత పతకం
మాన్విత, 4వ తరగతి, అండర్ -10 విభాగంలో స్టాండింగ్ లాంగ్ జంప్ లో, రజత పతకం మరియు 60 మీటర్ల పరుగులోకాంస్య పతకం
సిద్ధాంత్, 7వ తరగతి, అండర్ 12 విభాగంలో, స్టాండింగ్ లాంగ్ జంప్ లో రజత పతకం
ప్రణ్య, 4వ తరగతి 300 మీటర్ల పరుగు, కాంస్య పతకం
హ్రిధన్,3వ తరగతి,అండర్-8, 150 మీటర్ల పరుగు, కాంస్య పతకం
బంగారు పతకాలు సాధించిన వారందరూ కూడా త్వరలో అనగా ఈనెల 7వ తేదీన హన్మకొండలోని జె.ఎన్. స్టేడియంలో రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా నిర్వహించబడునని మరియు ఎంపికైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తూ వారిలో చైతన్యం నింపుతూ విజయాలు సాధించాలనే లక్ష్యంతో అద్భుతమైన శిక్షణ కొనసాగుతుందని వారు చెప్పారు.
విజేతలందరికీ పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు
విద్యార్థులు పాల్గొన్నారు.