Oct 30, 2025, 15:10 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
లివర్ వ్యాధితో మల్లారం గ్రామ పంచాయతీ కార్మికుడు మృతి
Oct 30, 2025, 15:10 IST
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో 30 ఏళ్ల గ్రామ పంచాయతీ కార్మికుడు బూర్ల నవీన్ కాలేయ వ్యాధితో బాధపడుతూ గురువారం మరణించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన నవీన్ మరణంతో అతని భార్య, ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. చిన్న వయసులోనే నవీన్ మరణించడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.