Feb 19, 2026, 06:02 IST/
AI కత్తికి రెండు వైపులా పదును: ప్రధాని మోదీ
Feb 19, 2026, 06:02 IST
ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది రెండు వైపులా పదునున్న కత్తి వంటిదని, దాని వినియోగంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, చారిత్రాత్మక AI ఇంపాక్ట్ సమ్మిట్ భారతదేశంలో జరగడం గర్వకారణమని కొనియాడారు. AI సదస్సు మేడిన్ ఇండియా, భారత్ సృజనాత్మకతకు వేదికగా నిలిచిందని, భారతీయ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని తెలిపారు. AI కేంద్రంగా భారత్ మారుతోందని, కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు ఈ సమ్మిట్ దోహదం చేస్తుందని చెప్పారు.