రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ఆదివారం వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. మామిడిపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ వడ్ల కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు వెళ్తుండగా రోడ్డు మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి, వడ్ల లోడుకు నష్టం వాటిల్లింది.