Feb 14, 2026, 01:02 IST/
కరీంనగర్లో ‘హస్తం’ విలవిల..!
Feb 14, 2026, 01:02 IST
కరీంనగర్ పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరాభవం ఎదురైంది. అభ్యర్థుల ఎంపికలో జరిగిన జాప్యం, పార్టీలోని అంతర్గత వర్గపోరు, క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం, బీజేపీ దూకుడును అడ్డుకోవడంలో వైఫల్యం వంటివి కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం, బలమైన స్థానిక నాయకత్వం కొరవడటంతో ఓటర్లు కాంగ్రెస్ కు దూరమయ్యారు. దీంతో నగరపాలక సంస్థ పీఠంపై కాంగ్రెస్ ఆశలు ఆవిరయ్యాయి.