Feb 11, 2026, 23:02 IST/కరీంనగర్
కరీంనగర్
ముగిసిన పోలింగ్.. అభ్యర్థులలో టెన్షన్
Feb 11, 2026, 23:02 IST
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలలో పోలింగ్ ముగియడంతో అభ్యర్థులలో టెన్షన్ మొదలైంది. ఫలితాలు ఎలా వస్తాయోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ ఫలితంపై ఓ అంచనాకు వస్తున్నప్పటికీ, పోలింగ్ రోజు ఎవరి ఓట్లు ఎటువైపు మల్లయోనని ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం వరకు వేచి చూస్తేనే ఫలితాలు వెల్లడి కానున్నాయి.